శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫిబ్రవరి 6 నుండి గాలెలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు.
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు.