Naveen Ul Haq: వన్డే ఫార్మాట్ నుంచి వైదొలుగుతానని చెప్పిన ఆఫ్ఘన్ స్టార్ ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని నవీన్ ఉల్ హాక్ అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ 2021లో తన లాస్ట్ వన్డే మ్యాచ్ ఆడాడు. కెరీర్‌లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన హాక్.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
Read Also: Agent OTT: అఖిల్ ఫాన్స్ కి బాడ్ న్యూస్.. ఏజెంట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై “స్టే”
Also Read
ఇక, నవీన్ ఉల్ హాక్ తన వన్డే కెరీర్‌లో 14 వికెట్లు తీసుకున్నాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉంది. ఈ యంగ్ ప్లేయర్ ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీతో గొడవతో నవీన్ ఉల్ హాక్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్ ఫ్రాంచైజీ క్రికెట్ కోసం తన అంతర్జాతీయ కెరీర్‌ను వదిలేసుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమ రెండో వరల్డ్‌కప్ ఆడేందుకు నిన్ననే భారతదేశానికి వచ్చింది. వార్మప్ గేమ్ కోసం ఆఫ్ఘన్ క్రికెటర్లు త్రివేండ్రంలో స్టే చేస్తున్నారు.
Read Also: Salt Effects: ఉప్పు ఎక్కువగా తింటే.. ఏ అవయవాలు పాడవుతాయో తెలుసా ?
తమ తొలి వరల్డ్‌కప్‌లో (2019) లీగ్ స్టేజ్ దాటలేని ఆఫ్ఘన్ జట్టు ఈసారి అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి సంచలనాలు సృష్టించాలని చూస్తుంది. ఆఫ్ఘన్ జట్టులో నవీన్ ఉల్ హాక్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ.. రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వీరితో ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టబోతుంది. దీనికి ముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. సెప్టెంబర్ 29న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 3న శ్రీలంకతో తలపడనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!