తనిష్క్ రెడ్డి, అంకిత సాహు జంటగా నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. రిచా భట్నాగర్, విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘జెర్సీ, మళ్ళీ రావా’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన మాధవ్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్ లో ఉండటంతో తాను ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు తనిష్క్ రెడ్డి తెలిపాడు. ‘యదార్థ…