FIH ప్రో లీగ్ టోర్నమెంట్‌కు సీనియర్ పాకిస్తాన్ హాకీ జట్టుతో పాటు మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్‌లో వివాదంలో చిక్కుకున్నారు. అర్జెంటీనా నుంచి పాకిస్తాన్‌కు తిరిగి వస్తున్న క్రమంలో విమానం రియో డి జనీరో విమానాశ్రయంలో ఇంధనం నింపేందుకు ఆగిన సమయంలో, విమానంలోనే ధూమపానం చేసినందుకు ఆయనను విమాన సిబ్బంది దింపేశారు. భద్రతా నిబంధనల ఉల్లంఘనగా భావించిన విమాన సిబ్బంది అంజుమ్ సయీద్‌తో పాటు మరో పాకిస్తాన్ ఆటగాడిని దుబాయ్‌కు…