పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. సచివాలయంలో ఈ రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు..
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు..
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయమైనట్లు తెలుస్తోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే ఫైల్స్ మిస్సింగ్ పై ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖలోని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కాగా.. ఫైల్స్ నిన్ననే మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో..…