గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన అంగన్వాడి వర్కర్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఎమ్మెల్యే కొడాలని నాని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం అంగన్వాడీ వర్కర్స్ గుడివాడ క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని మధ్య దారిలో ఆపేశారు. Also Read: Karanam Dharmasri: వచ్చే ఎన్నికల్లో సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా…
అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.