అంగన్వాడీల ప్రతి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. ఆందోళనకు వెళ్లొ్దని సూచించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. నవంబర్ 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి.. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది.. దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం..
అంగన్వాడీల అంశంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని.. మిగిలిన జిల్లాల్లో కూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని చెప్పారు.
ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. జిల్లాల్లో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్ల జారీకి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీల టెర్మినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరనివారిని తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. జీతాలు పెంచాలని అంగన్వాడీ సంఘాలు పట్టుబట్టాయి. ఇప్పటికిప్పుడు పెంచలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు.
అంగన్వాడీల ఆందోళనల నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి అంగన్వాడీలకు విఙప్తి చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో అంగన్వాడీలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరించారు.
అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. నేటి నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలకు సంబంధించిన మూడు ప్రధాన సంఘాలు.. మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి.
Telangana Govt: అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.