Madagascar: జనరల్-జెడ్ నిరసనలు మరొక దేశంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. మడగాస్కర్‌లో జనరల్-జెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని రోజుల తర్వాత కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆండ్రీ రాజోలినా పదవీచ్యుతుడయ్యారు. ఆ దేశ ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైనిక పాలకుడు మైఖేల్ రాండ్రియానిరినా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో జనాలు హర్షధ్వానాలు…