ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇందులో భాగంగా ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి.. ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్న, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.. ఆ తర్వాత కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి హాజరయ్యారు…