జర్నలిస్టు నుంచి రాజకీయనాయకుడిగా మారి శాసనసభలో అడుగుపెట్టిన క్రాంతి కిరణ్ నిత్యం చురుకుగా వుంటారు. తాజాగా ఆయన కబడ్డీ కబడ్డీ అంటూ గ్రామాల్లో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. రాష్ర్టంలో క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ క్రీడా మైదానాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంతురూ, సింగూర్,బస్వపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి క్రీడా మైదానాన్ని…