గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ జరుగుతుండగానే వైసీపీ, టీడీపీకి చెందిన ఇరుపార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం కాస్తా మరింత ముదిరి సభలోనే వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని తన నివాసంలో వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మర్రిపాడు నుంచి చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరారు.అక్కడి నుంచి చెన్నైకి తరలించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించామన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారమివ్వకండి అంటూ లేఖలో పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నేతలు, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి.
వరుణుడు తెలుగు రాష్ట్రాలను వదలనంటున్నాడు. మరో నాలుగు రోజుల పాటు తన ప్రభావం చూపిస్తానంటున్నాడు. ఈ మేరకు రాబోయే మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
నేడు ఏపీవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్కు ఆదీవాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనుల్లో వ్యతిరేకత నెలకొంది.