లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది.
మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రోజాకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని.. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.
సీఎం చంద్రబాబు రెండు సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2021లో ఆయన సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని శపథం చేశారు. దానిని నిలబెట్టుకుంటూ, శుక్రవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో కూర్చిన చంద్రబాబు భావోద్వేగానికి గురిఅయ్యినట్టు తెలుస్తుంది . సీఎం గా చంద్రబాబు, ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసారు.
AP Deputy CM Pawan Kalyan Chamber: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే రోజు ఖరారైంది. జూన్ 19వ తేదీ బుధవారం రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న శాఖలను తమకు…
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో మరోసారి తన మార్కుని ప్రదర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ మంత్రివర్గంలో మొత్తం 24 మంత్రి స్థానాలకు ఏకంగా 17 మందిని కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చిన మిగిలినవి టీడీపీ వారికీ కట్టబెట్టారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్న సీనియర్ నాయకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. కన్ఫర్మ్ సీట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళ అందరకి ఈ సరి బెర్త్ దక్కలేదు.…
ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్‌లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్‌సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం..…
నెల్లూరు జిల్లా ఉదయగిరి. ఇక్కడ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. ఈ మధ్య తరచూ వార్తల్లో.. ప్రచారంలో ఉంటున్న శాసనసభ్యుడు. వివాదాలు కోరుకుంటున్నారో ఏమో.. అవి లేకుండా చంద్రశేఖర్‌రెడ్డి పేరు ఉదయగిరిలో వినిపించదు. ఈ కోవలోనే చర్చల్లోకి వస్తోంది ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి యవ్వారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంత చెబితే అంత కాదు.. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. దాంతో ఆయనకు ఎమ్మెల్యే షాడో అనే గుర్తింపు వచ్చేసిందిట. ఏ పని కావాలన్నా మొదటిగా…
ఆ జిల్లాలోని అధికార వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోతోంది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి అసంతృప్తి గళాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. అధినాయకత్వంపై విధేయత ప్రకటిస్తూనే.. ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు అసమ్మతి వాదులు. ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్‌పై కేడర్ రుసరుసలుశ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. రహస్య సమావేశాలు కాస్త బహిరంగ మీటింగ్స్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, నియెజకవర్గ ఇంఛార్జ్‌లపై అసమ్మతి రాగం వినిపిస్తోంది కేడర్. పార్టీ కోసం…