Harish Rao: పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు.