తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్‌ను తప్పుబట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా పేర్కొన్న ఆమె.. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు.. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో…
ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.. రేపు మరోసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారు.
ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్ షా నుంచి గల్లీ లీడర్ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టారు. ఫ్యాన్ మీద పైచేయి కోసం బీజేపీ బెటాలియన్ మొత్తం దిగిపోతోంది. కానీ.... అదే పార్టీకి చెందిన ఒక్క ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడ్డం లేదట. పైగా సెగ్మెంట్లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకోని ఆ నియోజకవర్గ నేత ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలోని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామమైన తారువలో ఉద్రిక్తత ఏర్పడింది. బూడి ముత్యాల నాయుడు, ఆయన కుమారుడు బూడి రవిల మధ్య గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముస్లిం మైనారిటీ జేఏసీ నేతలు కలిశారు. ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డితో జేఏసీ నేతలు చర్చించారు.
జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. "కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?.. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?.. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?.. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. -సీఎం జగన్. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?"…