Tirupati Laddu Row: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీఐ డీఐజీ మురళీ రాంబా తిరుపతి సిట్ కార్యాలయానికి చేరుకుని సీబీఐ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.
ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఈరోజు ( అక్టోబర్ 4న) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు.
AP Inter Exam Schedule: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలలో జరిగే ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్మిడీయట్ పరీక్షల టైం టేబుల్ ను బోర్డు ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్ కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా విడుదల చేశారు.