నేడు పోలవరంలో మూడవ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగనుంది.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చించనున్నారు.. డయా ఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా..? లేదా..? అనే విషయంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం.. ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్ తో విడివిడిగా సమావేశం కానున్నారు..
ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుతున్న...ఆ మాజీ మంత్రి ఈ సారి ముందుగానే ఫిక్సయ్యారా ? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి నియోజకవర్గంలో పాలిటిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారా ? ఓడిన నియోజకవర్గంలోనే...గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారా ? సంక్రాంతి పండుగ తర్వాత...పార్టీ కార్యాలయం తెరిచేందుకు రెడీ అయిపోయారా ? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి...ఏంటా నియోజకవర్గం. ?
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు రైస్ మిల్లులలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లిలో అనేక మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
చాలా వరకు 70 శాతం మంది పలు అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్యా్న్సర్పై అవగాహన చాలా అవసరమన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ల బారిన పడుతున్నారని మంత్రి వెల్లడించారు.
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి లా అండ్ ఆర్డర్ లేదని అనటం ఆశ్చర్యంగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దళిత మంత్రి మీద విమర్శలు చేసి ఊరుకున్నారని.. లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించాల్సింది చంద్రబాబుని అంటూ ఆయన పేర్కొన్నారు.చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్కు లేదన్నారు. దళిత మహిళ కాబట్టి పడుతుంది అని పవన్ ఆమెపై విమర్శలు చేశారన్నారు.