పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్పై స్టే విధించాలని కోరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ పూర్తి అయ్యింది.. పోలింగ్ చట్ట విరుద్ధంగా అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు.. ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన చేసి పోలింగ్ ను అధికార పార్టీ నాయకులు చేయించారని కోర్టుకు తెలిపారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీ మూలంగా ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అంటూ ఫైర్ అయ్యారు..
ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది.. దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది అని వ్యాఖ్యానించారు.. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకో లేకపోయారంటే.. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ.. అవినీతికి, అణచివేతకు, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు.. 6,052 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు రాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో, టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడితే.. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది.. ఇక 30 ఏళ్ల తర్వాత పులివెందుల…
ఈ రోజు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గర్భిణికి డోలీమోత తప్పలేదు.. అనంతగిరి మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి డోలీలో తరలించిన సంఘటన చోటుచేసుకుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం చేశారు. 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు కేటుగాళ్లు.. దీంతో, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన బాధితురాలు శ్రీలక్ష్మి లబోదిమోమంటోంది..
విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..