నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా నైపుణ్యం పోర్టల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది.. ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.. తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని సలహా ఇచ్చారు.. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.. అసలు మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..? అని ప్రశ్నించారు..
సిట్ విచారణలో సంచలనం విషయాలు బయటపెట్టారట నారాయణస్వామి.. ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారులను నియమించడంలో నా పాత్ర ఏమీ లేదన్నారు.. నాకు లిక్కర్ కేసుకు సంబంధం లేదన్న ఆయన.. సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు.. నా మాట అక్కడ వినే వారు ఎవరంటూ చెప్పుకొచ్చారట నారాయణస్వామి.. నా మాటలను అక్కడ ఏ అధికారి వినలేదన్న ఆయన.. సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను ముందుపెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలారట.. నారాయణస్వామి నుంచి మరిన్ని కీలకమైన విషయాలు రాబట్టిందట…
డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు.. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు లోకేష్... ఇప్పటికే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించామన్నారు లోకేష్... అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయొద్దని అధికారులకు సూచించారు మంత్రి లోకేష్.. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.. విద్యా శాఖ…
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్య ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలిలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, అధికారం మారిన తర్వాత పరిస్థితి గురించి ఆలోచించాలి.. అధికారం పోయిన తర్వాత, చేసిన వాటిని అనుభవించాల్సి వస్తుంది.. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలి, లేకపోతే ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు కాటసాని రాంభూపాల్…
హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటును కోరారు.. “సాస్కి” పథకం (SASCI—-Special Assistance to States for Capital Investment) తో పాటు, “మిషన్ పూర్వోదయ” పథకం కింద ఏపీకి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.. “సాస్కి” పథకం ద్వారా రాష్ట్రాలకు “మూలధన పెట్టుబడి” (Capital Investment) కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయనుంది కేంద్రం..