ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఎంపీ పదవితో పాటు.. జిల్లా అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. ఈ మేరకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీని రాజ్యసభలో ఖాళీ చేశాం.. తర్వాత లోక్ సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మా పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వస్తున్నారు అని పేర్కొన్నారు.
త్వరలో కేజ్రీవాల్ ను కూడా జైలులో పెడతారు అంటూ ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. స్థానిక పార్టీలను సైతం బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తో అలయెన్స్ లో ఉన్న వారిని కమలం పార్టీ ఇబ్బందులు పెడుతుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.