Konathala and Dadi: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. అదీ ఎన్నికల సమయంలో జరిగే పరిణామాలు కీలంగా మారుతుంటాయి.. ఇప్పుడు తాజాగా జరిగిన మార్పులు.. అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.. అనకాపల్లిలో కొత్త రాజకీయ కాంబినేషన్ ఏర్పడేలా చేశాయి.. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న సీనియర్ రాజకీయ నేతలైన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్ర రావు చేతులు కలిపారు.. ఈ రోజు మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు.. జనసేన- టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. 40 ఏళ్లుగా అనకాపల్లి రాజకీయాల్లో వర్గ పోరు నడిపిన దాడి, కొణతాల ఇప్పుడు చేతులు కలపడంపై రెండు వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తు్న్నాయి..
Read Also: Hyderabad Crime: మీ ఇంటిని దెయ్యం ఆవహించిందంటూ.. మహిళకు టోకరా
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణ.. టికెట్ దక్కించుకున్నారు.. ఇక, సుదీర్ఘకాలంలో టీడీపీలో పనిచేసిన దాడి వీరభద్రరావు.. వైసీపీలోకి వెళ్లినా.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.. అయితే, రెండు పార్టీలో ఇప్పుడు పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నా ఇద్దరు మాజీ మంత్రులు, సీనియర్ పొలిటీషన్లు ఇప్పుడు చేతులు కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి వచ్చింది. 40 ఏళ్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేతలు.. ఇప్పుడు కలిసి పనిచేయాలని నిర్ణయిం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పూర్తిస్థాయిలో కొణతాల కోసం పనిచేస్తానని దాడి వీరభద్రరావు ప్రకటించారు.. ఇది అనకాపల్లి జిల్లా రాజకీయాలతో పాటు.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆసక్తికర పరిణామంగా మారింది.. అందుకే అంటారేమో.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ.. శాశ్వత మిత్రులు కానీ ఉండరని..