Bharath bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌కి నిరసనగా నేడు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన లేఖలో.. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని ఆ తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చెప్పారని ఆరోపించారు.
AP Secretariat Security: రాజధాని అమరావతి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.. విజయవాడలో మావోయిస్టులు అరెస్టు అయిన నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భద్రతా సడలింపులు కుదరకుండా పోలీసులు మరింత కచ్చితమైన విధానంలో భద్రతను పెంచారు. సచివాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీస్ విభాగాలు ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగుల ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ భద్రత పెంపు.. ముఖ్యంగా, మావోయిస్టులు విజయవాడ…