Ambati Rambabu: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారు.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు?.. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు.