Minister Anagani: తిరుపతిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 2 లక్షల 10 వేల మందికి 113 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 17 నెలల్లో 51 వేల కోట్లు పెన్షన్లుగా అందించాం.. రాయలసీమలో తిరుపతిని అభివృద్ధి చేయడం కోసం సీఎం కృషి చేస్తున్నారు.. తిరుపతిని ఎకో సిస్టంగాటౌన్ షిప్ గా, న్యూ కన్వెన్షన్ గా, టూరిజం ద్వారా కూడా అభివృద్ధి చేస్తున్నాం.. పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారుల గడువు కూడా రేపటితో పూర్తి అవుతున్న నేపథ్యంలో, నిందితులు ఎవరనేది క్లియర్ గా బయటపడుతుంది అని మంత్రి అనగాని పేర్కొన్నారు.
Read Also: Euphoria teaser : గుణశేఖర్ ‘యుఫోరియా’ టీజర్ విడుదల
అయితే, తప్పు చేసిన వారు ఎవరు తప్పించుకోలేరు.. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ చేసుకోవడం చరిత్రలో జరగని విషయం అని అనగాని సత్యప్రసాద్ అన్నారు. విచారణ పట్ల వ్యంగ్యంగా మాట్లాడే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదు.. అన్ని అబద్ధాలు చెప్పి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.. సూత్రదారి, పాత్రధారి ఆయనే కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడుతారని విమర్శలు గుప్పించారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రర్ నియామకంలో ఆనంద్ రెడ్డి కోర్టు ఆశ్రయించారు, ఆ వ్యవహారంలో తప్పు ఉంటే ఐజీ, డీఐజీ చర్యలు తీసుకుంటారని చెప్పారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసుల్లో తప్పులు చేశామని ఒప్పుకుంటూనే, తాము చేయలేదని, ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు.