దాదాపు నాలుగు గంటల పాటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌లు సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.