New judges to AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు త్వరలోనే ఏడుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల జాబితాలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ, బండారు శ్యామ్‌సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీనరసింహ, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. కాగా…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరుగా సాగుతాయి.. ప్రభుత్వాలు వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరి.. ఆ సమయానికి చూసిచూడనట్టు వ్యవహరించిన సందర్భాలు ఎన్నో.. గతంలో సంక్రాంతికి ముందు హైకోర్టు.. కోడి పందాలను నిషేధించడం.. దానిని సుప్రీం కోర్టు ఎత్తివేయడం కూడా జరిగిపోయాయి.. అయితే, కోడి పందాల వ్యవహారం మరోసారి హైకోర్టుకు వెళ్లింది.. కోడి పందాలను నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. కోడి పందాలు, జూదం, అక్రమ మద్యం…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేయడంతో.. ఇది మరింత చర్చకు దారితీసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను సంప్రదించిన సంగతి తెలిసిందే కాగా… ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. సినిమా టికెట్ల ధరలపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరి చేసి…