AP Heavy Rains Flood Alerts: దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు, బాపట్ల జిల్లాలను తీవ్రమైన వర్ష విపత్తులోకి నెట్టేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో రెండు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి భారీ వర్షాలు కరిశాయి. దీంతో నగరాలు, శివార్లు, గ్రామాలు అన్నీ నీటితో నిండిపోయి ప్రజలకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో రాత్రి కురిసిన భారీ వాన నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో బంగారు రేణువులు కోసం ఎగబడ్డారు. తుఫాన్ల సమయంలో అలలు భారీగా ఎగసి పడి.. ఇసుకతోపాటు బంగారం రేణువులు కొట్టుకొస్తాయని.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా చేపల కోసం మాత్రమే వేట కొనసాగించే మత్స్య కారులు ప్రస్తుతం… బంగారం కోసం వేటను ప్రారంభించారు. దీంతో ఉప్పాడ తీరానికి జనాలు క్యూ కడుతున్నారు. Read Also: Digital Car Key: ఇకపై ఫోన్ తోనే కార్ అన్ లాకింగ్..కొత్త ఫీచర్ తో వస్తున్న…