విధి ఎంత బలీయమైనదో చూడండి.. డ్యూటీలో ఉన్న కండక్టర్..సొంతూరు కు వెళ్తున్న ఓ వృద్ధురాలు గుండెపోటు బస్సులోనే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన కె.ఈశ్వరరావు(51) శృంగవరపుకోట డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం కొట్టాం-విశాఖ-కించుమండ రూట్‌లో విధులకు వెళ్లి తిరిగి వస్తూ.. అస్వస్థతగా ఉందని డ్రైవర్‌కు తెలిపారు. కొద్ది క్షణాల్లోనే కూర్చున్న సీటులో…