ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది విజయవాడ విమానాశ్రయం మిలియన్ మార్క్‌ను అందుకుంది. ఇంకా రెండు నెలలు ఉండటంతో ఈ సంఖ్యలో మరో మూడు లక్షల మంది పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మరో వైపు ప్రయాణికుల రద్దీని పరిశీలిస్తే, విజయవాడ ఎయిర్‌పోర్ట్ ఈసారి ఆల్ టైం రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది.