తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటనకు, గంభీరమైన డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరైన ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ ఇండస్ట్రీలో యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అర్హతను గుర్తించిన పూణెలోని ప్రతిష్ఠాత్మక ఆంధ్ర సంఘం, ఆయనను ఘనంగా సత్కరించి గౌరవప్రదమైన క్షణాలను అందించింది. ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి కుమార్‌తో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్‌ను ‘అభినయ వాచస్పతి’ అవార్డుతో…