CM Revanth Reddy: అందెశ్రీ ఆకస్మిక మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి..
- అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు..
- తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రాసిన సమయంలో..
- అందెశ్రీతో జరిపిన సంభాషణలను గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Also: Tamannaah special song: తెలుగులో మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
ఇక, తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… అందెశ్రీ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ సందర్భంగా అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రెటరీకి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.
తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అందెశ్రీ.
నిత్యం పేదల పక్షాన… pic.twitter.com/Hs5v0gZmlL
— Revanth Reddy (@revanth_anumula) November 10, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!