తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈ మధ్య కాలంలో వరుస డిజాస్టర్లతో చేతులు కాల్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా ప్లాప్స్‌తో ఫైనాన్షియల్ స్ట్రగుల్ కన్నా రెప్యుటేషన్ పరంగా గ్రాఫ్ తగ్గుతుంది. స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించి అడ్డంగా బుక్కయ్యింది. మిషన్ చాప్టర్ 1, లాల్ సలామ్, వెట్టియాన్, ఇండియన్ 2, విదాముయర్చి లాంటి ప్రాజెక్టులు ఎలాంటి రిజల్ట్స్ అందించాయో అందరికీ తెలుసు. Also Read : Kingdom :…
KH237: విక్రమ్ సినిమాతో లోక నాయకుడు కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా లాభాలను అందుకొని.. తన బ్యానర్ ను విస్తరిస్తున్నాడు. ఇక విక్రమ్ తరువాత కమల్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మణిరత్నం సొంత బ్యానర్ అయిన మద్రాస్ టాకీస్ తో కలిసి నిర్మిస్తున్నాడు.