అనంతరపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గుంతకల్లు-బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే కనీసం ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిన్న రాత్రి బ్రిడ్జిపై నుంచి నుంచి కిందకు ఓ కారు పడిపోయింది. వంతెనపై నుంచి సుమారు 30 అడుగుల కిందకు కారు పడిపోయింది. దీంతో వంతెన కింద్రి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జలసమాధి అయ్యాడు.…