Ananth Sriram: కోలీవుడ్ బాహుబలిగా తెరకెక్కింది పొన్నియన్ సెల్వన్. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ, విక్రమ్, జయంరవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.