భక్తుల పాలిట కొంగు బంగారమైన అనంతపురం గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి జాతర కొనసాగుతోంది. చాగలగుట్టపల్లిలోని పుట్టింటి నుంచి భారీ ఊరేగింపుతో గంగమ్మ తల్లి జాతరకు చేర్చారు. అడుగడుగునా అమ్మవారికి బోనాలు, మంగళహారతులు పట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం కోసం అమ్మవారి ఆలయం ఎదుట మహిళలు వరపడారు. సంతానం ప్రసాదించమని గంగమ్మతల్లిని వేడుకున్నారు. తమ కష్టాలను తొలగించి సుఖశాంతులు ప్రసాదించమని కోరుతూ గంగమ్మ తల్లికి…