ఉగాది వచ్చేస్తోంది.. తెలుగు వారి పండుగతో పాటు కొత్త జిల్లాల్లో డబుల్ ఉగాది జరగనుంది. దీనికి కారణం.. ఉగాది నుంచి పాలన సాగించేందుకు యంత్రాంగం చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టడం. ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం సిద్ధమవగా.. తాజాగా అన్ని శాఖలు ఉద్యోగుల విభజనతో పాటు కార్యాలయాలు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అనంతలో కొత్త శ్రీ సత్యసాయి జిల్లా పేరుతో ఆవిర్భవిస్తున్న పుట్టపర్తిలో అధికారుల చర్యలతో సందడి కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలనకు…