Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away: బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ జనతా పార్టీకి తీవ్ర లోటు ఏర్పడింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం వెల్లడించారు. 56 ఏళ్ల మామణి సౌదత్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన…