‘అమ్మ’ అన్న పదంలో ఉన్నవి రెండక్షరాలే- ఆ రెండు అక్షరాల్లోనే అమృతం మించిన మధురం దాగుంది. ఈ సత్యాన్ని చాటుతూ ఎన్నో చిత్రాలు తెలుగువారిని అలరించాయి. అయినా, కన్నతల్లిని గౌరవించే సంతానం ఎంతమంది ఉన్నారో కానీ, ప్రతీసారి అమ్మ ప్రాధాన్యం చెప్పవలసి వస్తూనే ఉంది. అమృతమయమైన అమ్మను కీర్తిస్తూ పాటలూ పలికించవలసి వస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు తన తొలి చిత్రం ‘తాత-మనవడు’లోనే తల్లి గొప్పతనాన్ని చక్కగా తెరకెక్కించారు. ‘అమ్మ రాజీనామా’కు 30 ఏళ్ళు అదే…