ప్రధాని నరేంద్ర మోడీ అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కొనసాగించిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.