ఆప్ఘనిస్థాన్ బృందం భారత్‌లో పర్యటిస్తోంది. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో ఆ దేశ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్‌మీట్ నిర్వహించారు.