వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.