నటుడిగా, క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ‘అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి’ అనే ఆల్బమ్ సాంగ్ లో నటించాడు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.…