హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఇటీవల ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపైనే ఉంది. అంతేకాకుండా.. రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచి అక్రమ కట్టడాలను కూల్చేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే.. హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తున్న హైడ్రా…