కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని జనసేన ఆరోపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరించారో టీడీపీ, జనసేన మర్చిపోయినట్లు ఉన్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రైతుల రుణమాఫీ రద్దు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? రైతుల రూ. 87,600 కోట్ల రుణం మాఫీ చేస్తామని చెప్పి…తీరా చేసింది 15వేల కోట్లు మాత్రమే. రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా?…
ఏపీలో ఇప్పుడంతా కేబినెట్ మార్పుల గురించే చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్టీవీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ ఆలోచన ప్రకారం జరుగుతుంది. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే అన్నారు. మంత్రివర్గ మార్పులు.. చేర్పులపై ఎవరికీ క్లారిటీ లేదు. సీఎం జగన్ ఏ రోజు చెబితే ఆ రోజు రాజీనామాలు చేసేందుకు మంత్రులందరూ సిద్ధంగా వున్నామన్నారు. సీఎం జగన్ నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరుండాలని నిర్ణయిస్తే వారే ఉంటారు. జనసేన…