Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డులో పెట్టిన డబ్బు కార్డు కాలం చెల్లినపుడు తిరిగి రాకపోవడంపై మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అమెజాన్ ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గడువు తీరిన వెంటనే వినియోగదారుడి ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యేలా చూడాలని అమెజాన్ కు తెలిపారు.