అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అపరకుభేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు… అమెజాన్ సీఈవో పదవికి ఆయన గుడ్‌బై చెప్పనున్నారు.. జులై 5న తేదీన సీఈవో బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగేందుకు సిద్ధమయ్యారు.. ఇక, ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు.. ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు బెజోస్ .. కాగా, ఫిబ్రవరిలోనే బెజోస్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సీటెల్‌కు చెందిన అమెజాన్.కామ్ ఇంక్ ప్రకటించింది.…