అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్.. ఆ రోజు సెంటిమెంట్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అపరకుభేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు… అమెజాన్ సీఈవో పదవికి ఆయన గుడ్‌బై చెప్పనున్నారు.. జులై 5న తేదీన సీఈవో బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగేందుకు సిద్ధమయ్యారు.. ఇక, ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు.. ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు బెజోస్ .. కాగా, ఫిబ్రవరిలోనే బెజోస్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సీటెల్‌కు చెందిన అమెజాన్.కామ్ ఇంక్ ప్రకటించింది. కానీ, నిర్దిష్ట తేదీని వెల్లడించలేదు. జెఫ్ స్థానంలో ఉన్న జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్-కంప్యూటింగ్ బిజినెస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదవి నుంచి తప్పుకున్న అనంతరం బెజోస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
ఇంటర్నెట్‌తో పుస్తకాలను అమ్మడం ద్వారా అమెజాన్ సంస్థను జెఫ్ బెజోస్ ప్రారంభించారు. జూలై 5 బెజోస్‌కు చాలా సెంటిమెంట్. అందుకే అదే రోజున సీఈవో పదవి బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారు.. అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఈ ప్రకటన చేశారు జెఫ్ డెజోస్.. ఇక, బెజోస్ వ్యక్తిగత సంపాదన 167 బిలియన్ డాలర్లు. సీఈవో.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కొత్త ఉత్పత్తులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారని చెబుతున్నారు.. అయితే, సరిగ్గా 27 ఏళ్ల క్రితం అదే రోజున అమెజాన్ సంస్థ ప్రారంభమైంది.. అందుకే జులై 5వ తేదీన నాకు చాలా ప్రత్యేకమైనద ఆయన తెలిపారు.
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!