అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు.