Amaravati Capital: అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయం చర్చించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ…