Amaravati Capital: అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయం చర్చించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Read Also: Election Commission: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డెట్.. వారంలోనే..
ఇక, రాజధాని నిర్మాణంలో భాగంగా రైతులకు భూవినిమయ ఒప్పందంలో 98 శాతం ప్లాట్ల పంపిణీ పూర్తైనట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మిగిలిన 2 శాతం సమస్యలు కూడా త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాశ్వతంగా ప్రకటించేందుకు పార్లమెంట్ సాక్షిగా బిల్లు తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. దీనితో అమరావతి రాజధాని విషయంలో ఓపెన్ ఎండింగ్ లేకుండా శాసనపరంగా పూర్తి నిర్ధారణ కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, అమరావతి గెజిట్‌పై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, రాజధాని ప్రాంతంలో తిరిగి కార్యకలాపాలు వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
రాజధానిలో రైతుల సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం జరిగింది.. రైతుల సమస్యలపై చర్చించారు.. రాజధాని లో రైతులకు ప్లాట్ల కేటాయింపు.. జరీబు భూములు.. గ్రామ కంఠ సమస్యల పై కూడా చర్చించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్… దాదాపు 30 వేల మంది రైతులు. 34 వేల ఎకరాలకు పైగా రాజధానికి భూములను ఇచ్చారు.. రైతుల త్యాగాలు ఎప్పటికి గుర్తుంటాయి అన్నారు.. ఇన్ని వేల మంది రైతులు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి… 700 ఎకరాల్లో… ప్లాట్లు కేటాయింపు జరగాలి.. అసైన్డ్ ల్యాండ్… ఇతర కారణాలతో ప్లాట్లు కేటాయింపు జరగలేదు అన్నారు.. ఇక, 30 రోజుల్లో జరీబు సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పాం అన్నారు.. కొంతమంది గైడ్ లైన్స్ పాటించక పోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. లంక గ్రామాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి.. లంక ప్రాంత భూములను తీసుకుని మంచి భూమి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు..
మరోవైపు, అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో మరోపరిస్థితి ఉంది.. కొంతమంది అమ్ముకున్నారు.. అసైన్డ్ ల్యాండ్స్ విషయం లో రాష్ట్రం మొత్తం పరిస్థితి అంచనా వేయాల్సి ఉందన్నారు.. 90 రోజుల్లో అసైన్డ్ ల్యాండ్ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం అని ప్రకటించారు పెమ్మసాని.. ఐదుగురు కాంట్రాక్టర్లు, రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతారు.. వచ్చే జూన్ లో రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం.. వచ్చే ఆరు నెలల్లో రైతుల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..