Gujarat Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్చీ ప్రాంతంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన ఆదివారం సాయంత్ర కూలిపోయింది. దీంతో కేబుల్ బ్రిడ్జిపై ఉన్న దాదాపుగా 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. పునర్నిర్మాణం తరువాత ఐదు రోజుల క్రితమే కేబుల్ వంతెను పున:ప్రారంభించారు.